ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అక్టోబరు 5న విజయదశమి సందర్భంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
కాగా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం కొత్త కాన్వాయ్ సిద్ధమవుతోంది. పవన్ యాత్ర కోసం భారీ కాన్వాయ్‌ను జనసేన పార్టీ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బ్లాక్ కలర్ మహింద్రా స్కార్పియో వాహనాలు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బారులు తీరాయి. ఈ మేరకు 8 వాహనాలను జనసేన పార్టీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాన్వాయ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా పవన్ బస్సు యాత్రకు అనుగుణంగా కాన్వాయ్ వాహనాల్లో ఇంటీరియర్ మార్పులు జరగనున్నాయి.
Janasena party State office🔥🔥🔥 pic.twitter.com/KSIn51Fjmw
— Narendra Janasena🔯 (@Narendra4PK) June 12, 2022