Site icon NTV Telugu

MLA Housemaid Suicide: ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య.. కేసులో షాకింగ్ ట్విస్ట్

Mla Maid Suicide

Mla Maid Suicide

Nellore MLA Sanjeevaiah Housemaid Arunakumari Suicide Mystery: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే చిలివేటి సంజీవయ్య ఇంట్లో పనిచేస్తున్న అరుణకుమారి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. అయితే.. ఈ కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. వివాహేతర సంబంధమే ఆమె ఆత్మహత్యకు కారణమనే కోణం తెరమీదకి వచ్చింది. కొన్ని నెలల క్రితమే అరుణకుమారిని ఆమె బంధువులు ఎమ్మెల్యే సంజీవయ్య ఇంట్లో పనికి కుదిర్చారు. మొదట్లో అంతా సజావుగానే సాగింది కానీ, ఎప్పుడైతే ఆమెకు ఎమ్మెల్యే కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తేజ పరిచయం అయ్యాడో, అప్పటి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Adipurush: రోజుకి 100 కోట్లు! మండేకి ఆల్ రికార్డ్స్ అవుట్?

రోజులు గడిచేకొద్ది అరుణకుమారి, తేజ మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఇద్దరు కలిసి షికారుకి వెళ్లిన వీడియోలను సైతం రికార్డ్ చేశారు. ఈ విషయం అరుణకుమారి కుటుంబసభ్యులకు తెలియడంతో.. వాళ్లు మందలించారు. ఒకసారి తేజను నెల్లూరు నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. అరుణకుమారి భర్త, అతని స్నేహితులు తీవ్రంగా మందలించారు. మరోసారి సన్నిహితంగా మెలిగితే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. అయినా ఇద్దరిలో మార్పు రాలేదని అరుణకుమార్ భర్త గణేశ్ ఆరోపణలు చేస్తున్నాడు. తేజ వల్లే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని, తన భార్య మృతికి అతడే కారణమని ఆరోపిస్తున్నారు. అరుణకుమారి మృతిచెందిన నాలుగు రోజుల తర్వాత తనకు పోలీసులు సమాచారం అందించారని.. చనిపోయిన వెంటనే ఎందుకు తెలియచేయలేదని గణేష్ నిలదీస్తున్నాడు.

Vasantha Krishna Prasad: దేవినేని ఉమా.. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు, పాలు అమ్మావా?

తనకు పిల్లలు ఉన్నారని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని గణేష్ కోరుతున్నాడు. మరోవైపు.. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు జైల్లో పెట్టి, అతడ్ని ప్రశ్నించారు. అనంతరం తేజను పంపించినట్టుగా తెలిసింది. ఈ కేసుని తాము అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని.. అరుణకుమారి ఆత్మహత్యకు తేజతో ఉన్న సాన్నిహిత్యమే కారణమా? లేక మరే ఇతర కారణాలున్నాయా? తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

Exit mobile version