విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చెత్త పన్ను వసూళ్లల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చెత్త పన్నును వసూలు చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేసింది. చెత్తపన్ను వసూళ్లల్లో అలక్ష్యంతో వ్యవహరించే వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెత్తపన్ను వసూళ్లల్లో అలక్ష్యం వహిస్తున్నారంటూ విజయవాడలో వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే ఇద్దరు శానిటరీ సెక్రటరీలను సస్పెన్షన్ వేటు వేయడం, మరో నలుగురు శానిటరీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. చెత్త పన్ను వసూలుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని ఉన్నతాధికారుల సూచించారు.
గతంలో.. జులై 27న చెత్త వసూళ్లపై కొడాలి నాని స్పందించిన విషయం తెలిసిందే. గుడివాడ పట్టణంలో ప్రజల నుంచి చెత్త పన్ను కింద నెలకు రూ.90 వసూలు చేయొద్దని ఎమ్మెల్యే కొడాలి నాని పురపాలక అధికారులను ఆదేశించారు. పట్టణంలో నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనతో.. మహిళలు చెత్త పన్ను చెల్లింపు భారంగా ఉందని, అద్దెకు ఉంటున్నవారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని నాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కొడాలినాని మున్సిపల్ సహాయ కమిషనరును పిలిచి చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పాను కదా మళ్లీ ఎందుకు చేస్తున్నారని అడిగారు. చెత్త పన్ను వసూళ్లలో గుడివాడ రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉందని ఏసీ బదులివ్వగా నెలకు ఎంత వసూలు చేస్తున్నారని నాని అడిగారు. ఇకపై చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. దీనిపై బందరు శాసనసభ్యుడు పేర్ని నానితో కలిసి సీఎంను కలుస్తామని తెలిపిన విషయం తెలిసిందే అయితే.. చెత్త పన్నుపై మళ్లీ ఈరచ్చ చోటుచేసుకోవడంపై చర్చకు దారితీస్తోంది. ఏకంగా ఇద్దరిపై సస్పెన్షన్ వేటువేయగా.. మరో నలుగురు శానిటరీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
BIG BREAKING : అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ..