NEET Exam: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఈరోజు (మే 4న) జరగబోతుంది. రెండు షిఫ్టుల్లో.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ లో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ పరీక్ష రాసే అవకాశం ఉందని అంచనా. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గతేడాది 66 వేల మంది దరఖాస్తు చేయగా.. 64 వేల మంది పరీక్ష రాశారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే ఏపీ నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Road Accidents: ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ పరీక్ష కేంద్రాలను అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేశారు. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 6, 500 మేర మెడిసిన్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించనున్నారు.
