నెల్లూరు వైసీపీలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. వెంకటగిరి వై.సి.పి. సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మరోసారి ఎం.ఎల్.ఏ.అనం పై నేదురుమల్లి విమర్శలు చేయడం చర్చకు దారితీస్తోంది. పెంచలకోన లోని ఆలయానికి వెళితే తనను అవమానించాలని చూశారన్నారు. కానీ నేను రెండు సార్లు పెంచలకొన కు వెళ్ళా. నాకు దేవుడు రెండు పదవులు ఇచ్చాడు. రాపూరు మండలంలో ఇప్పటి వరకూ పెత్తనం చెలాయించిన చెన్ను కుటుంబాన్ని నేను దగ్గరకు తీయను అన్నారు.
Read Also: Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు
ఎమ్మెల్యే గా గెలిచిన ఆనం రాపూరు మండలంలో చెన్ను కుటుంబానికి మాత్రమే పదవులు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో పార్టీని వీడుతున్నారు. జగన్ ను తిట్టినా దయతలచి ఎం.ఏల్.టికెట్ ఇచ్చినా కృతజ్ఞత లేదు. టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారని రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇటు కోటంరెడ్డి, అటు ఆనం రామనారాయణరెడ్డి విమర్శలతో నెల్లూరు వైసీపీలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే కోటంరెడ్డి టీడీపీలోకి వెళుతున్నానని ప్రకటించారు.
Read Also: Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు