Site icon NTV Telugu

సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా… ఆరోగ్యం బాగోలేదని లేఖ

ఏపీ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇటీవల ఏపీసీఐడీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. గతంలో నమోదైన కేసుల్లో విచారణకు రావాలని ఈనెల 12న హైదరాబాద్‌లో తన నివాసంలో సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని… అందులో ఈనెల 17న విచారణకు రావాలని సూచించారన్నారు. అయితే తాను అత్యవసర పని మీద ఢిల్లీకి వచ్చానని… ఆరోగ్యపరమైన కారణాలతో వైద్యులను సంప్రదించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తాను సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కావాలని లేఖలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.

https://ntvtelugu.com/nara-lokesh-demands-to-cm-jagan-on-school-holidays-extended/

రఘురామ విచారణకు హాజరుకాకపోవడంతో సీఐడీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆయన బెయిల్ షరతుల్లో సీఐడీ విచారణకు హాజరుకావాలని ఉంది. ఒకవేళ విచారణకు రఘురామ హాజరుకాకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్లి సీఐడీ పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎంపీ రఘురామ తనకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.

Exit mobile version