Site icon NTV Telugu

TarakaRatna Health Bulletin: విషమంగానే ఆరోగ్యం.. తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల

Tarakaratna Health Bulletin

Tarakaratna Health Bulletin

TarakaRatna Health Bulletin: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు వైద్యులు.. తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాల సపోర్టుతో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు తారకరత్నకు ఏక్మో సపోర్టు అందించలేదని తమ ప్రకటనలో స్పష్టం చేశారు.. మరోవైపు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నట్టు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు..

Read Also: RK Roja: మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్‌..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా నియామకం..

కాగా, కుప్పంలో నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా కుప్పకూలి స్పృహతప్పిపోయారు.. మొదట కుప్పంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.. ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇక, నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా తారకరత్నను పరామర్శిస్తూ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీస్తున్నారు.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తారకరత్నను పరామర్శించారు.. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు రావాలని నందమూరి ఫ్యాన్స్‌, టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

Exit mobile version