NTV Telugu Site icon

నారా లోకేష్‌కు కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది… వరుసగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు పొలిటికల్ లీడర్లు, అధికారులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కోవిడ్ సోకింది.. ట్విట్టర్‌ ద్వారా స్వయంగా ఈ విషయాన్ని నారా లోకేష్‌ వెల్లడించారు.. తనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్‌ లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌గా వచ్చిందన్నారు.. తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్టర్‌లో వెల్లడించిన లోకేష్.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు.. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు నారా లోకేష్‌.

కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కొన్ని క్షణాల ముందే లేఖ రాశారు నారా లోకేష్‌.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని గుర్తుచేసిన ఆయన.. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.. ఇక, 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సూచించిన ఆయన.. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని తన లేఖలో డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.