Site icon NTV Telugu

Nara Lokesh: పోలీసుల అదుపులో లోకేష్‌.. టీడీపీ నేతలు ఆందోళన

Naralokesh Arest

Naralokesh Arest

Nara Lokesh taken into custody in Srikakulam: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ ను శ్రీకాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్‌ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలోని కొత్త రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలాసకు వెల్లకుండా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో.. పార్టీ శ్రేణులు రోడ్డుపైనే లోకేష్ బైఠాయించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మొహరించారు. అనుమతించాలని కోరుతూ.. రోడ్డు బైఠాయించి నిరసనచేపట్టారు. పోలీసులకు నారాలోకేష్‌ కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నారాలోకేష్‌ ను అదుపులో తీసుకున్నారు. లోకేష్‌ తోపాటుగా.. కళా వెంకట్రావు, చినరాజప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎచ్చెర్ల మండలం జేఆర్‌ పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అయితే.. వాణిజ్య కేంద్రమైన జంట పట్టణంలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూదందాపై గత వారం రోజులుగా అధికార, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇంఛార్జీ గౌతు శిరీష మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇది వరకే ప్రకటించడంతో.. ఇంతలో శ్రీనివాస నగర్ కాలనీ వివాదం తెరపైకి వచ్చి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా.. ఓవైపు మంత్రి అప్పలరాజు ఆ వార్డులోని కౌన్సిలర్ సూర్య నారాయణ ఇళ్లను తొలగిస్తామంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Garbage tax: చెత్త పన్ను వసూళ్లల్లో నిర్లక్ష్యం.. నలుగురికి షోకాజ్ నోటీసులు..!

Exit mobile version