Site icon NTV Telugu

జగన్ వెళ్లింది పరామర్శలకా? సెల్ఫీలు తీసుకోవడానికా?: లోకేష్

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని లోకేష్ ఆరోపించారు.

‘మీరు వెళ్లింది.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ‌చ్చిన విప‌త్తు వ‌ల్ల జ‌రిగిన వేల‌కోట్ల న‌ష్టం ప‌రిశీలించ‌డానికి. ప్రజల్ని దూరం పెట్టి ప‌ళ్లు ఇకిలిస్తూ ఫోటోలు దిగ‌డానికి కాదు. జ‌నం బాధ‌లు మీకు అంత పైశాచిక‌ ఆనందం క‌లిగిస్తున్నాయా?’ అంటూ లోకేష్ సూటిగా ప్రశ్నించారు. లోకేష్ షేర్ చేసిన ఫోటోలో సీఎం జగన్‌తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా వరద బాధితులతో సీఎం జగన్ నవ్వుతున్న ఫోటోలను కూడా లోకేష్ షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version