Site icon NTV Telugu

Nara Lokesh : శవరాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని ఆయన విమర్శించారు. శవరాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్ అంటూ ఆయన ఆరోపించారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ అని తీవ్రంగా ధ్వజమెత్తారు.

మనకు తెలిసి చనిపోయింది 25 మందే, తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలని ఆయన అన్నారు. మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా..? అని ఆయన వ్యాఖ్యానించారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకన్న మరణాలపై పోస్ట్‌ మార్టం రిపోర్టు రాకముందే మంత్రులే సహజ మరణాలని తేల్చడమేంటని ఆయన మండిపడ్డారు. జగ్గారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేపట్టాలన్నారు.

https://ntvtelugu.com/cm-jagan-fire-on-tdp-at-assembly/

Exit mobile version