ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని… ఉన్న పరిశ్రమలు రాష్ట్రానికి బై చెప్తున్నాయని లోకేష్ ఆరోపించారు. టాటా గ్రూప్ 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణ లేదా తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోందన్నారు. లులూ గ్రూప్ కూడా ఏపీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని లోకేష్ వివరించారు.
Read Also: టిక్కెటింగ్ సిస్టంపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీకి పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ఆసక్తి చూపాయని… టీడీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు యువతకు దూరమయ్యాయని లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఎన్నో పరిశ్రమలు ఏపీకి దూరమయ్యాయని.. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి దూరం కావడమే కాకుండా ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని లోకేష్ వివరించారు.
