టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్రజల బుగ్గలు గిల్లుతూ.. ముద్దులు పెడుతూ అధికారంలోకి వచ్చాడు ఈ జగన్ మోసపు రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా.. ఎన్నికల ముందు సంక్షేమాన్ని పెంచుతామంటూ ధరలన్నీ పెంచుతున్నాడని, చెత్తపై కూడా పన్ను వేసేవాడిని చెత్త నాకొడుకు అంటామంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 850 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఆడబిడ్డలకు ఎక్కడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలకు అండగా నిలిచేందుకు వెళ్తే మాపై రాళ్ల దాడి చేశారని, అక్కచెల్లెళ్లలకు పసుపు జెండా అండ ఎప్పుడు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మాపై 14 కేసులు పెట్టినా నేను భయపడలేదని, వాళ్ళు పెట్టే కేసులు ఫ్లూటు లాంటివి.. ఏయ్ జగన్ రెడ్డి.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహాల వంటి టీడీపీ నేతల ముందు కాదు అంటూ ఆయన డైలాగ్ వేశారు.