Site icon NTV Telugu

Nara Lokesh: కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం

ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడూస్తూనే ఉంది.. ఓవైపు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు పేరుతో ఉద్యమం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూంది.. అయితే, కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం వల్ల జగన్‌కు, వైసీపీ నేతలకు ఆత్మ సంతృప్తి కలగొచ్చు.. కానీ, ఈ విమర్శల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదని సీఎం జగన్ గుర్తించాలని సూచించారు నారా లేకేష్‌.

Read Also: Supreme Court: బెయిల్‌ వచ్చిందని సంబరాలు..! లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు

తెలుగుదేశం పార్టీపై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై సొంత ఊరికి తీసుకెళ్లాడు ఓ తండ్రి అని గుర్తుచేశారు నారా లోకేష్‌.. ఇటువంటి దయనీయ పరిస్థితిని కల్పించింది వైసీపీ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండి.. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి అంటూ అధికార పార్టీ నేతలకు సలహాఇచ్చారు నారా లోకేష్‌.

Exit mobile version