Site icon NTV Telugu

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న ఆలయం హుండీలో చోరీ.. ఇద్దరు మైనర్లు సహా నలుగురి అరెస్ట్..!

Srisailam

Srisailam

Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ కలకలం రేపుతోంది.. ఈ నెల 1వ తేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్ బాలురు.. ఆలయంలోని హుండీలో చోరీ పాల్పడ్డారు.. మల్లికార్జునస్వామి ఆలయం ప్రారంభంలో గల క్లాత్ హుండీని బ్లేడ్ తో కోసి డబ్బు తీస్తుండగా సీసీ టీవీలో ఆ దృశ్యాలు నమోదు కావడం.. మరోవైపు.. సీసీ టీవీని పర్యవేక్షిస్తున్న అధికారులు.. వెంటనే అప్రమత్తం అయ్యి ఆ బాలురను పట్టుకున్నారట.. ఇద్దరు మైనర్ల దగ్గర 10,150 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారట.. ఇక, శ్రీశైలం దేవస్థానం ఈవో ఆదేశాలతో కేసు నమోదు చేసి గోప్యంగా విచారణ జరుపుతున్నారట శ్రీశైలం పోలీసులు.. అయితే, గత పది రోజులుగా ఇద్దరు మైనర్లు దర్శనం పేరుతో క్యూలైన్లలో ఆలయంలోకి రావడంతో.. ఇలా దొంగతనానికి పాల్పడుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు.. మరోవైపు.. చోరీ విషయమై విధుల్లో అలసత్వం వహించిన మల్లన్న ఆలయ సీనియర్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేసే యోచనలో ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నట్టుగా తెలుస్తోంది.. హుండీలో చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లు.. మరో ఇద్దరు మేజర్లుపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది..

Read Also: JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు ‘డబుల్’ ధమాకా

Exit mobile version