Loan App harassment: లోన్లు ఇస్తామంటూ ఆఫర్ చేయడం.. లోన్ తీసుకున్న తర్వాత వేధింపులకు గురిచేయడమే లోన్ యాప్‌ల పనిగా మారిపోయింది.. ఇప్పటికే ఈ లోన్‌యాప్‌ల బారినపడి ఎంతో మంది వేధింపులకు గురవుతుండగా.. మరికొందరు ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. అయితే, తాజాగా, నంద్యాలలోని సచివాలయ ఉద్యోగి చక్రధర్ అదృశ్యం అయ్యారు.. లోన్ యాఫ్ వేధింపులు భరించలేకే.. చక్రధర్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.. నూనెపల్లె ప్రాంతంలో నివాసం ఉండే చక్రధర్.. నంద్యాల సచివాలయంలో పనిచేస్తున్నాడు.. అయితే, స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్టుగా చెబుతున్నారు.. పెట్టుబడుల కోసం అప్పులు చేసి, భార్య నగలు అమ్మి కూడా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడట.. అంతటితో ఆగకుండా.. లోన్‌యాప్‌ల నుంచి కూడా లోన్ తీసుకున్నాడట.. ఓవైపు లోన్ యాప్‌లు.. మరోవైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగిపోతుండడంతో.. సెల్ ఫోన్, బైక్ వదిలేసి అదృశ్యం అయ్యాడు చక్రధర్.. బాధితుడిగా ఉన్న చక్రధర్‌తో పాటు కుటుంబ సభ్యులు.. అతడి కాంటాక్ట్ నంబర్లు కూడా లోన్‌యాప్‌ల నుంచి ఫోన్ల వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, చక్రధర్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన నంద్యాల త్రీ టౌన్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Operation Raavan: సినిమా ప్రారంభమైన గంటలోపు అది కనిపెడితే.. సిల్వర్ కాయిన్!