Site icon NTV Telugu

Python on Drunk Man: ఏం తాగావ్‌రా నాయనా..? కొండచిలువ పైకి ఎక్కినా లేవ లేదు..!

Python

Python

Python on Drunk Man: మందు బాబులు పండగ చేసుకున్నారు.. దసరాకు కిక్కు ఎక్కించారు.. ఖజానాలో కాసుల వర్షం కురిపించారు.. మరోవైపు.. ఫుల్‌గా మద్యం సేవించిన వాళ్లు రకరాలుగా ప్రవర్తిస్తుంటారు.. కొందరు కిందామీదాపడి ఇంటికి చేరుకుంటే.. కొందరు.. సేఫ్‌ ప్లేస్‌ చూసుకునే మద్యం సేవించి అక్కడే ఉండిపోతారు.. ఇంకా కొందరైతే.. ఎంత తాగారు..? ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారో..? కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోతారు.. లిక్కర్‌ లోపలికి వెళ్లిన తర్వాత రకరకాలుగా మాట్లాడేస్తుంటురు.. తమకంటే పుడింగులు ఎవరు లేరని కోతలు కోస్తారు.. ఇంకా కొందరైతే.. ఎక్కడపడితే అక్కడే పడుకుండిపోతారు.. మద్యం సేవించి నిద్రలోకి జారుకుంటారు.. ఆ తర్వాత ఏం జరిగినా.. తెలియని స్థితిలోకి వెళ్లిపోతారు.. అలాంటి ఘటనే నంద్యాలలో జరిగింది..

Read Also: RamCharan: నెక్ట్స్ రెండు సినిమాలను లాక్ చేసిన మెగా పవర్ స్టార్..

నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం సింగనపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు.. అది ఎంతలా అంటే.. కిక్కులో నిద్రపోతున్న అతడిపైకి కొండ చిలువ వచ్చి చేరినా సడిసప్పుడు లేదు.. పీకలదాకా తాగి చలనం లేకుండా మత్తులోకి వెళ్లిపోయాడు ఓ లారీ డ్రైవర్.. అయితే, మత్తులో ఉన్న మందు బాబుపై ఒళ్లంతా అటూ ఇటూ పాకి చూడసాగింది కొండచిలువ.. అతడిపై పట్టుకోసం ప్రయత్నించసాగింది.. అయితే, మందుబాబు పై ఎక్కిన కొండచిలువను గుర్తించన స్థానికులు.. అప్రమత్తం అయ్యారు.. దానిని అదిరిస్తూ.. బెదిరిస్తూ.. కర్రల సహాయంతో కొండ చిలువను తొలగించారు.. మొత్తానికి కొండ చిలువ బారినుండి ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు మందుబాబు.. ఆ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో.. వైరల్‌గా మారిపోయాయి..

Exit mobile version