NTV Telugu Site icon

OCTOPUS Mock Drill: శ్రీశైలం డ్యామ్‌ వద్ద అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్

Srisailam

Srisailam

OCTOPUS Mock Drill: శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో అర్ధరాత్రి సమయంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది.. రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి.. చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ ఏపీ మంగళగిరి ఎస్పీ రవిచంద్ర ఆద్వర్యంలో 48 మందితో కూడుకున్న ఆక్టోపస్ టీమ్ ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం భద్రత.. తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా జలాశయంపై తీవ్ర వాదులు చొరబడితే వారి చెర నుంచి అధికారులను, వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే ఆంశంపై తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదురుకోవాలనే ప్రక్రియను రియల్‌గా అత్యాధునిక ఆయుధాలతో.. చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి.. వారి చెరలో చిక్కుకున్నవారిని ఎలా విడిపించాలి.. వాళ్ల బారి నుంచి ఎలా బయటపడాలనే ప్రక్రియ అత్యద్భుతంగా ఉత్కంఠ వాతావరణంలో హై టెన్షన్ పరిస్థితులకు సంబంధించిన మాక్ డ్రిల్‌ ను ఆక్టోపస్ పోలీసు బలగాలు నిర్వహించారు.. శ్రీశైలం జలాశయం సమీపంలోని వ్యూ పాయింట్ నుంచి కొండలు.. గుట్టలు దిగుతూ.. చిమ్మ చీకట్లో.. అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ చేశారు.. శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చికటి వాతావరణం.. నిశబ్దమైన వాతావరణంతో శ్రీశైలం టూటౌన్ సీఐ చంద్రబాబు తమ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు..

Read Also: Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. రెక్కీ చేసి పుష్ప 2 థియేటర్ దోచేశారు!

Show comments