Nandyal District: కరుడు గట్టిన రౌడీషీటర్ కు 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి.. జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల పత్రాన్ని రౌడీషీటర్ ఎస్సీ బాబుకు అందించారు కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్.. రౌడీషీటర్ ఎస్సీ బాబుపై వివిధ పోలీస్ స్టేషన్ లలో అనేక కేసులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు.
Read Also: Wife: రాత్రిపూట నా భార్య పాములాగ మారుతోంది సార్.. భర్త ఫిర్యాదు
నంద్యాల జిల్లా సంజామల మండలం ఆల్వ కొండ కు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్ అందనం బాబు అలియాస్ ఎస్సీ బాబు (51)అనే వ్యక్తికి 6 నెలలపాటు జిల్లా బహిష్కరణ విధిస్తూ జిల్లా కలెక్టర్ రాజ కుమారి గనియా ఉత్తర్వులు జారీ చేశారు.. రౌడీషీటర్ ఎస్సీ బాబును కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్ పోలీస్ సర్కిల్ కార్యాలయానికి పిలిపించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన బహిష్కరణ ఉత్తర్వుల పత్రాన్ని అందజేశారు. ఎస్సీ బాబు తరచూ నేరాలకు పాల్పడుతూ ఆల్వ కొండ గ్రామంతో పాటు సంజామల మండలంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నట్లు
పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ ఎస్సీ బాబుపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా జిల్లా బహిష్కరణ తప్పదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం 6 నెలల వరకు రౌడీ షీటర్ ఎస్సీ బాబు జిల్లాలో అడుగు పెట్టడానికి వీలులేదని.. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.
