Site icon NTV Telugu

MLA Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఎవరు దూరం అయ్యారు..!

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

MLA Bhuma Akhila Priya: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న కూటమి ప్రభత్వాన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.. ఇక, కళ్లు తిరిగి పడిపోయి నేను హాస్పిటల్ లో ఉంటే.. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు..? ఎవరు రాలేదంటూ..? వార్తలు రాస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఉదయం లేస్తే నేనేం చేస్తున్నాను..? నాకు ఎవరు దూరం అయ్యారు…? ఇలా కల్పితాలని రాయడం పక్కనపెట్టి.. మేం ప్రజలకు చేస్తున్న సేవలు రాయండి అంటూ సలహాఇచ్చారు.. మరోవైపు, అహోబిలం అభివృద్ధికి కేంద్రం రూ. 25 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ..

Read Also: CM Revanth Reddy: నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తా.. ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా?

కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురైన విషయం విదితమే.. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెలో జరిగిన మూల పెద్దమ్మ దేవర జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరుడ దీపాన్ని మోసిన తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు. బీపీ కారణంగా స్పృహ తప్పిపడిపోయారు. ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ఆ తర్వాత మూల పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అఖిల ప్రియ సోదరి భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు.. కానీ, ఆస్పత్రిలో ఉన్న అఖిలప్రియను పరామర్శించకుండానే.. వాళ్లు తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవడం చర్చగా మారింది.. ఇక, ఈ రోజు ఆ ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భూమా అఖిలప్రియ..

Exit mobile version