Site icon NTV Telugu

BC Janardhan Reddy: చిన్నారి బాలికల చేత రోడ్డు ప్రారంభోత్సం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Bc

Bc

BC Janardhan Reddy: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడాది పాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి బాలికల చేత సిమెంట్ రోడ్డును ప్రారంభోత్సవ రిబ్బన్ కటింగ్ చేయించారు మంత్రి. అలాగే, రూ. 1 కోటి 20 లక్షల వ్యయం తో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సం చేశారు. ఇక, మంత్రి మాట్లాడుతూ.. రప్ప రప్పా నరుకుతామని అంటున్నారు, ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఏడాది క్రితమే వైసీపీని నరికేశారు అని సెటైర్లు వేశారు. ఒక్కో నాయకుడి డైలాగులు వింటున్నాం, కోతల రాయుళ్లు కొత్తగా పుట్టుకొస్తున్నారు అని మంత్రి జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం

ఇక, ఉత్తర కుమార ప్రగల్బాలు చెబితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తున్నారు, మేము అభివృద్ధి కోసం పాటు పడుతున్నాం అన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కూడా వైసీపీ నేతల్లో మార్పు రాలేదు.. ఇప్పటికైనా మాట్లాడే భాష తీరు మార్చుకోండి అని మంత్రి సూచించారు.

Exit mobile version