NTV Telugu Site icon

Selfie Death: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి.. మహానంది క్షేత్రం సమీపంలో యువకుడు మృతి..

Selfie Death

Selfie Death

Selfie Death: స్మార్ట్‌ ఫోన్లు ప్రాణాలు తీస్తున్నాయి.. ఎవరి చేతిలో అయినా స్మార్ట్‌ఫోన్లు.. ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. సెల్ఫీ దిగాల్సిందే.. ఇక, రీల్స్‌ పిచ్చి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.. అయితే, ఇప్పుడు మరో యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. నంద్యాల జిల్లాలో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది.. మహానంది క్షేత్రం సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద సెల్ఫీ దిగడానికి వెళ్లిన సుర గౌతమ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తెలుగుగంగలో పడి గల్లంతయ్యాడు.. గాజులపల్లె ఆర్.ఎస్. సమీపంలో గౌతమ్ మృతదేహన్ని గుర్తించారు స్థానికులు.. వారు పంపించిన ఫొటోలు, వీడియోల ఆధారంగా మృతదేహాన్ని గాలిస్తున్నారు మహానంది పోలీసులు.. గౌతం స్వస్థలం వైయస్సార్ కడప జిల్లా బద్వేలు టౌన్ ఐలమ్మ కాలనీగా చెబుతున్నారు.. వ్యవసాయ కూలిగా పనిచేస్తే జీవనం సాగిస్తున్న గౌతమ్.. మహానంది క్షేత్రానికి వచ్చి తిరిగి వెళ్తుండా.. తెలుగు గంగ కాలువ దగ్గర సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు.. అదే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.. ఇక, గౌతమ్ తల్లి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మహానంది పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..

Read Also: Auto Driver Rules: మీ యాటిట్యూడ్‭ను మడిచి జోబీలో పెట్టుకోండి.. కస్టమర్స్‭కు ఆటో డ్రైవర్ దెబ్బ మాములుగా లేదుగా

Show comments