NTV Telugu Site icon

Makara Sankranti Brahmotsavam: శ్రీశైలంలో రేపటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..

Srisailam Temple

Srisailam Temple

Makara Sankranti Brahmotsavam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి.. బుధావారం ఐదోవరోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి రావణవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణవాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు..

Read Also: CM Revanth Reddy: తెలంగాణ‌కు నీటి కేటాయింపులు విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి..

ఇక, రేపటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నారు.. నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.. యాగశాలలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం నిర్వహించనున్నారు.. సాయంత్రం సద్యసం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికిన ధ్వజపటం ధ్వజవరోహణ నిర్వహిస్తారు.. కాగా, శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. మరోవైపు, శ్రీశైలం ఆలయంలో జరిగే పూజలపై అర్చకులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు మోమో ఇచ్చారు.. ఆలయంలో నిత్యపూజ కైంకర్యాలు, ఉత్సవాలలో ఏర్పాట్లపై వివరణ కోరుతూ వైదిక సిబ్బందికి మెమో ఈవో శ్రీనివాసరావు మోమో ఇచ్చారు. ఇటీవల జరిగిన అరుద్రోత్సవం రోజున ఆలయంలో ఏకాంత జరిగే పూజలలో హారతికి ఈవోను అంతరాలయం నుండి హారతి దర్శనానికి అర్చకులు అనుమతించకపోవడంతో ఆలయంలో జరిగే పూజలపై వివరణ కోరారు. దీనిపై అర్చకులు ఈవోను కలసి వివరంగా చెప్పారు. ఎంకాంత జరిగే సేవలలో అర్చకులు తప్ప ఎవరూ రాకూడదని ఏకాంత పూజలకు అర్చకులు మినహా ఇతరులు వెళ్లడం మంచిది కాదని ఈవోకు అర్చకులు తెలియజేసారు.

Show comments