NTV Telugu Site icon

Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్‌

Srisailam

Srisailam

Shivaratri Brahmotsavam 2025: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు.. ఇక, ఈ సారి 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. జిల్లా యంత్రాంగ సహాయ, సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.. దేవస్థానం అన్ని విభాగాల అధికారులు విభాగాలపరంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మహాశివరాత్రి అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి మొదటివారంలోగా పూర్తి చేసేలా చూడాలని.. గత సంవత్సరం కంటే 30 శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు..

Read Also: PM Modi to Visit Kuwait: నేడు కువైట్కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్‌ దేశంలో పర్యటన!

ఇక, మహారాత్రి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు, శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, రథోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు ఈవో.. పాదయాత్రతో వచ్చే భక్తులకు నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లను కల్పించాలని.. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్, జ్యోతిర్ముడి సమర్పణ.. శివరాత్రికి వచ్చే భక్తులు సేదతీరేందుకు ఆరుబయట ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు, మంచినీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు..

Show comments