Site icon NTV Telugu

Leopard: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం.. బెదిరిపోతున్న భక్తులు..!

Chirutha

Chirutha

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే, చిరుతపులి మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇక, మహానందిలోని గోశాల దగ్గర చిరుత రాత్రి సంచరించినట్లు అక్కడి సీసీటీవీల్లో కనిపించింది. అయితే, అక్కడి చిరుత వచ్చి కాసేపు తిరిగి వెళ్లడం కెమెరాల్లో రికార్డైంది. దీంతో స్థానికులను, భక్తులను ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు.

Read Also: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం.. గజమాలతో సన్మానం

ఇక, స్థానికులు ఎవరూ పెంపుడు జంతువులను బయటకు వదలొద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. అలాగే మహానంది పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ భక్తులు బయట పడకోవద్దని కూడా మైకుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు అటవీ శాఖ అధికారులు చిరుత అక్కడే సంచరిస్తుండటంతో దానిని పట్టుకునేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. దీంతో మహానందికి వెళ్లే భక్తులు రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక, మహానందికి వెళ్లేందుకు భక్తుల సంఖ్య రోజు రోజుకు క్రమంగా తగ్గిపోతుంది.

Exit mobile version