NTV Telugu Site icon

Train Accident: నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు..

Nandyal

Nandyal

Train Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు.. 5వ లైన్‌పై రైలు నిలిచిపోయింది.. దీంతో.. పట్టాల పైనుంచి పక్కకు ఒరిగాయి చివరి 5 బోగీలు.. అయితే, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.. 1, 2 లైన్లపై యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు.. మరోవైపు.. రైలు పట్టాలు తప్పడంపై విచారణ చేపట్టారు రైల్వే అధికారులు.. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు రైల్వే సిబ్బంది చెబుతున్నారు.. ఇక, పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు రైల్వే సిబ్బంది..

Read Also: Bhatti Vikramarka: సీఎంఆర్‌ పెండింగ్.. మిల్లులపై కఠిన చర్యలకు డిప్యూటీ సీఎం ఆదేశాలు

కర్ణాటక లోని బెటిపిన్ నుండి కాకినాడకు వెళ్తున్న ఖాళీ డీజిల్ ట్యాంక్‌ రైలు.. నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. డీజిల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కాకినాడ సమీపం లోని గంగినేని ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఖాళీ ట్యాంకర్లతో బయలుదేరింది. రైలు స్టేషన్ చేరుకోగానే కేవలం 10 కిలోమీటర్ల వేగం ఉన్నప్పుడు చివరి 3 బోగీలు పట్టాలు తప్పాయి… అయితే, 5 వ లైన్ లో జరగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది రాలేదు. మరో రైలును తెప్పించి పట్టాలపైకి ఎక్కించారు. యుద్ధ ప్రాతిపదికపై లైన్ పునరుద్దన పనులు చేపట్టారు..

Show comments