NTV Telugu Site icon

Nandamuri Balakrishna: అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరు..

Balaiah

Balaiah

Nandamuri Balakrishna: అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్నారు నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విజయవాడలో వేగా జ్యూవెలరీ షోరూంను ప్రజ్ఞా జైస్వాల్, వేగా జ్యూవెలరీ సంస్థల ప్రతినిధులు నవీన్‌ కుమార్‌, సుధాకర్‌లతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేగా జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. చాలామంది బంగారు షాపు ప్రారంభోత్సవానికి వస్తున్నానంటే రకరకాలుగా మాట్లాడుకున్నారు.. ఆయన నాకేమీ పర్వాలేదు.. తెలుగువారిని ముందుండి నడిపించడంలో నేనెప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చారు.. ఇక, మా ఇంటి పేరుతో ఉన్న నందమూరి రోడ్ లో ఈ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు బాలయ్య.

Read Also: Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా

మహిళలకు ఎంతో ఇష్టమైనవి ఆభరణాలు… కమ్మలు, గాజులు, బంగారుపు నగలను భర్తలతో చెప్పి కొనిచ్చుకోండి అంటూ మహిళలకు సూచించిన బాలయ్య.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు.. మన తెలుగింటి ఆడపడుచులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అన్నారు.. ఇక, తాజాగా విడుదలైన తన చిత్రం వీర సింహారెడ్డి చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించారాన్ని ఆనందం వ్యక్తం చేశారు.. మరోవైపు అన్ స్టాపబుల్ టాక్ షో ని అంతా కలిసి విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు.. అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్న బాలయ్య.. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలలో సాధికారత సాధించిన మహిళలందరికీ ఇవే నా శుభాకాంక్షలు అన్నారు. ఇక, బాలయ్య, హీరోయిన్‌ ప్రజ్ఞా జైస్వాల్‌ విజయవాడ రావడంతో.. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. దీంతో.. నందమూరి రోడ్‌ సందడిగా మారింది.

Show comments