వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డి ఏమీ పెద్ద లీడర్ కాదన్న ఆయన.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బొమ్మ లేకుండా సొంతం బొమ్మతో పోటీ చేయగలరా..? పోటీ చేసి గెలిచే దమ్ము ఉందా…? అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఇంటికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు కిషోర్ కుమార్‌రెడ్డి.. చంద్రబాబు ముప్పై సంవత్సరాల తర్వాత మా ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు.. మరోవైపు, రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాదారణం, ఇవన్నీ మామూలే అన్నారు.. అయితే, 2024 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. పుంగనూరులో కూడా విజయం మాదేనని కామెంట్ చేశారు.. మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కిషోర్‌కుమార్‌రెడ్డి… మంత్రి పెద్దిరెడ్డికి తెలిసిందల్లా దోచుకోవడమేనని సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Cancer Diagnosis: క్యాన్సర్‌ని మరింత కచ్చితంగా గుర్తించేందుకు ఏఐ టూల్
కాగా, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఇవాళ పాల్గొన్నారు చంద్రబాబు.. ఈ పర్యటనలో కిషోర్‌కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు చంద్రబాబు.. ఓవైపు మినీ మహానాడులు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు.. మరోవైపు బాదుడే బాదుడు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పెరిగిన ధరలను, ప్రభుత్వ విధానాలను ఎండగడుతోన్న విషయం తెలిసిందే.