Site icon NTV Telugu

Nallari Brothers: ఎంత కాలానికో..! ఒకే వేదికపై నల్లారి బ్రదర్స్‌..

Nallari Brothers

Nallari Brothers

నల్లారి బ్రదర్స్‌.. అంటే తెలియనివారుండరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. ఆయన సోదరుడు టీడీపీ నేత నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి.. అయితే, ఈ అన్నదమ్ములు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.. చాలా కాలమంటే.. ఏకంగా సంవత్సరాలు గడిచిపోయింది.. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది.. ఒకే వేదికపై నల్లారి బ్రదర్స్‌ అంటే.. ఏదో పొలిటికల్‌ మీటింగ్‌ అని మాత్రం అనుకోవద్దు.. ఎందుకంటే.. వారు ఓ శుభ కార్యానికి హాజరయ్యారు.. పీలేరులోని నల్లారి అభిమాని వివాహ వేడుకకు హాజరైన ఈ సోదరులు.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.. ఇక, చాలా ఏళ్ల తర్వాత సోదరులు ఇద్దరూ ఒకే వేదికపై ఇలా కనిపించడంతో.. నల్లారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: CM YS Jagan Golden Heart: మా కుమారుడిని బతికించాలని దంపతుల వినతి.. తానున్నానంటూ సీఎం జగన్‌ భరోసా

మొత్తంగా.. గత ఎన్నికల తర్వాత దూరంగా ఉంటూ వచ్చిన అన్నదమ్ములు.. ఇవాళ పీలేరులో జరిగిన నల్లారి అభిమాని వివాహ వేడుకలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు టీడీటీ ఇంఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇలా ఒకే వేదికపై కనిపించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. కాగా, టీడీపీలో చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న కిషోర్‌ కుమార్.. పీలేరులో కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. 2009 లో పీలేరు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరిసారి విజయం సాధించారు.. ఇక, 2014లో తన సోదరుడు పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఉన్న విభేదాలతోనే ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోసారి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఆయన కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. మరోవైపు, నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆ మధ్య ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలతో కలిసినా.. రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గా లేని విషయం విదితమే.

Exit mobile version