జనసేన ఆవిర్భావ సభ నేడు మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ ఎత్తున్న నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాలను నుంచి ఇప్పటం గ్రామానికి జనసైనికులు పోటెత్తారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. రాజకీయ దొంగలు.. ప్రజల జీవితాలనే దోచేస్తారని, పిల్లలను.. ఉద్యోగాలను.. భవిష్యత్తుని రాజకీయ దొంగలు దోచుకుంటున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల్ని దోచుకునే రాజకీయ దొంగలను ప్రజలే ఎన్నుకోవడం బాధాకరమన్నారు. డాక్టర్ గారి అబ్బాయితో ఏపీ ఆపరేషన్ చేయించుకుందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఏపీ నుంచి వచ్చామని చెప్పగానే జాలితో చూస్తున్నారు.. వెటకారంతో నవ్వుతున్నారని ఆయన వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. జగన్ కెబినెట్టులో మంత్రులకు వాళ్ల శాఖల పేర్లు కూడా మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు చేయడానికి పని లేక ఫొన్లల్లో కాలక్షేపం చేస్తూ దొరికిపోతున్నారని, సీఎం జగన్.. సలహాదారుడు, కొందరు మంత్రులు మినహా ఎవ్వరూ బాగుండ లేదన్నారు. ఏపీలో నిత్యం అప్పులు-కష్టాలు.. అవి మరిచిపోవడానికి గోల్డ్ మెడల్ బ్రాండ్లు, ఇప్పుడు మద్యం బాబు చేతుల్లో గోల్డ్ మెడల్ కన్పిస్తోందన్నారు.