Site icon NTV Telugu

Nadendla Manohar: పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ కామెంట్లు బాధాకరం

Jagan, Nadendla Manohar

Jagan, Nadendla Manohar

పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ కామెంట్లు బాధాకరమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించేలా సీఎం జగన్‌ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తనం చేసారు. పవన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేశారని నిప్పులు చెరిగారు. గతంలో పవన్‌ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెట్టించారని గుర్తు చేసారు. ఇప్పుడా మంత్రులు పదవులు కొల్పోయారని, పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే సమయాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించండని ఎద్దేవ చేసారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టి హోల్‌సేల్‌గా అమ్ముడుపోయింది వైసీపీనేనని ప్రజలందరికీ అర్థమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బటన్‌ నొక్కడమే మానవత్వమా..? అంటూ ప్రశ్నించారు. బటన్‌ నొక్కి వారికి వారే చప్పట్లు కొట్టేసుకుంటున్నారని విమర్శించారు. కోనసీమ అల్లర్లు వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు.

read also: Commonwealth Games: అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు.. ప్రధాని మోడీ ప్రశంసలు

ప్రభుత్వ సాయం ఏంటో వరదల సమయంలో అర్థమవుతోందని విమర్శించారు. ముందుగా నిర్ణయించిన వారినే సీఎం జగన్‌ కలిసి వరద పర్యటనను ముగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాకుడా.. కులాలకు అతీతంగా సమాజ అభ్యున్నతి కోసం కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని ధ్వజమెత్తారు. అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నదీ.. ఎందుకు అలజడి సృష్టించాలనుకున్నదీ ప్రజలకు అర్థమవుతున్నందువల్లే పవన్‌కల్యాణ్‌పై సీఎం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మనోహర్‌ ఆరోపించారు. అంతేకాదు…కాపు నేస్తం కింద 3.38 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని చెబుతున్నారనీ.. ప్రభుత్వ నిబంధనల పేరుతో ఎంత మందికి లబ్ధి అందలేదో కూడా చెప్పాలని, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యలోనే సాయం ఆగిపోయి వారు ఎన్నో పాట్లు పడుతున్నారని గుర్తు చేసారు.
Commonwealth Games: అమ్మాయిల కీలక పోరు.. నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్

Exit mobile version