Site icon NTV Telugu

Nadendla Manohar: మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే లక్ష్యం

మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే జనసేన లక్ష్యం అన్నారు నాదెండ్ల మనోహర్. మహిళా ప్రాంతీయ కమిటీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ సిద్ధాంతాలను పునరుద్ఘాటించారు. ఆర్ధికంగా వెనకబడ్డ మహిళలకు ఏడాదికి లక్ష ఆదాయం వచ్చేలా వీర మహిళ విభాగం కృషి చేయాలన్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకో గ్రామం. మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. ప్రతి జిల్లాలో మహిళలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తాం. క్షేత్రస్థాయిలో నిస్వార్ధంగా పనిచేసే వీరమహిళలకు కమిటీల్లో పెద్దపీట వేస్తాం అన్నారు నాదెండ్ల మనోహర్.

https://ntvtelugu.com/micro-plastic-in-human-blood-cells/
Exit mobile version