తెలుగు సినీ ప్రముఖులు-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… మంగళగిరిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌రెడ్డిది విచిత్ర ధోరణి.. కపట మనస్తత్వం అంటూ మండిపడ్డారు.. సమస్యను సృష్టిస్తారు… తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసిన ఆయన.. సినీ ప్రముఖుల్ని పిలిచి పబ్లిసిటీ స్టంట్ చేశారని సెటైర్లు వేశారు.. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన నాదెండ్ల… సినీ పరిశ్రమను విశాఖకు రమ్మని పిలుస్తున్న ముఖ్యమంత్రికి అమరావతి గుర్తుకు రాలేదా? అంటూ నిలదీశారు.
Read Also: Komatireddy: కొబ్బరికాయ కొట్టించిన కేసీఆర్.. ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి..!
ఇక, సినిమా టిక్కెట్ల కోసం కేటాయించిన సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేటాయించరా? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్… సామాన్యుడి అర్జీకి సీఎం కార్యాలయం స్పందించే పరిస్థితి లేదని మండిపడ్డ ఆయన.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందల కోట్లు మాయం చేశారని ఆరోపించారు.. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లబ్ధి కోసం మాట్లాడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు మనోహర్.. ఇక, నిన్న జరిగిన సమావేశానికి అందరినీ ఆహ్వానించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. సినిమా పరిశ్రమలో వేరే వాళ్లు లేరా? అని అని ప్రశ్నించారు.. అందరినీ ఎందుకు ఆహ్వానించరు అని నిలదీశారు.. నా దగ్గరికి తగ్గి వస్తేనే అనే ధోరణిలో సీఎం ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.
