NTV Telugu Site icon

Nadendla Manohar: మంత్రులకు నిజాయితీ ఉంటే ఉపాధి కల్పించాలి

Nadendla Manohar

Nadendla Manohar

సీఎం జగన్ పర్యటనపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ పర్యటన అనంతరం ఇవాళ ఎచ్చెర్ల , శ్రీకాకుళం నియోజకవర్గాలలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే మత్స్యకారుల కష్టాలు తెలుస్తాయి. మత్స్యకార గ్రామాలలో వలసలు పోవడం దారుణం అన్నారు. మత్స్యకారుల యువతకు పార్టీ పరంగా సహకారం అందిస్తాం అన్నారు. జగన్ పరిపాలన చేతగాని నిధులు వృధా చేసే ముఖ్యమంత్రి.

కర్ఫ్యూ వాతావరణం లోనే ముఖ్యమంత్రి జిల్లాకు రావాల్సి వచ్చింది.151 స్థానాలు వచ్చిన వ్యక్తికి ఎందుకు భయపడాల్సి వచ్చింది. జనంలోకి కొచ్చి మాట్లాడడానికి జగన్ భయపడుతున్నాడు. పరిపాలన చేతగాని వ్యక్తికి ముఖ్య మంత్రి పదవి ఇస్తే ఇలానే ఉంటుంది. జనసేన పార్టీలో మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ కూడా ఏర్పాటు చేశాం. మత్స్యకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ కి నివేదిక ఇస్తానన్నారు మనోహర్. ప్రభుత్వ వేదికలను రాజకీయం కోసం వ్యక్తిగత ఆరోపణల కోసం వాడుతున్నారని విమర్శించారు.

Read ALso: MLAs Purchase Case : మరోసారి న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు

ప్రజాదనంతో ఏర్పాటు చేసిన సభలను కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడానికి వాడుతున్నారు. దమ్ముంటే పోలీసులు అధికారి యంత్రాంగం లేకుండా జగన్ బయటకు రాగలడా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఉద్దాన సమస్యలను మొట్టమొదటిసారి తెలుగులోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. రాజకీయ లబ్ధి కోసం ఓట్లు కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ సమాజం కోసమే పని చేస్తారు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోరుకుంటుంది కానీ మూడు రాజధానులు కోరుకోవడం లేదన్నారు. జిల్లా మంత్రులకు నిజాయితీ ఉంటే యువతకి ఉపాధి కల్పించాలని మనోహర్ డిమాండ్ చేశారు.

Read Also: Ranbir- Alia: అలియా.. కూతురుకు ఏం పేరు పెట్టిందో తెలుసా ..?