ఏపీ వ్యసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు. కోనసీమలో క్రాప్ హాలీడే గురించి ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలు రాజకీయ హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు. వీళ్ళు క్రాప్ హాలీడే అని దుష్ప్రచారం చేస్తున్నారు.సీఎం పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
నవరత్నాల్లో మొదటి హామీ రైతు భరోసా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఉద్యమాలు చేస్తే అణచి వేశారు. కరువు మండలాలు టీడీపీ హయంలోనే ఎక్కువగా వుండేవి. 2018-19 చంద్రబాబు పాలనలో ఖరీఫ్ మొత్తం కరువులోనే ఉంది. వ్యవసాయ బడ్జెట్‌లో కూడా ఈ ప్రభుత్వం అధిక కేటాయింపులు చేసిందన్నారు.
ఇన్ ఫుట్ సబ్సిడీ సకాలంలో చెల్లించాం. జగన్ సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా నష్ట పరిహారం అందించారు.పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ లపై ఎందుకు మాట్లాడరు? అని ఆయన ప్రశ్నించారు. కోస్తా ప్రాంతంలో కొంత పల్లపు భూములు ఉంటాయి. సాధారణంగా ఇక్కడ ఖరీఫ్ వదిలేసి రబీలో పంట వేసుకుంటారన్నారు.
