కొంతమందికి మటన్, చికెన్ ఇంట్లో వండకపోతే కుదరదు. ముద్ద దిగదు. అయితే మనం తినేది అసలు మంచి మటనేనా, కుళ్లిందా అని తెలుసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ముదురు మటన్ వాసన రాదు. తోక చిన్నగా ఉంటే లేతది అని.. తోక పెద్దగా ఉంటే ముదురు మటన్ అంటారు. కానీ మటన్ షాపు వాళ్లు తోకలు లేకుండానే మటన్ తెస్తుంటారు. కాస్త తక్కువ ధరకు దొరుకుతుంది కదాని కొనేసి ఇంటికి తీసికెళ్ళి మసాలా దట్టించి వండి లాగించేస్తారు. కుళ్ళిన మటన్ తింటే అనారోగ్యం గ్యారంటీ.
తాజాగా విజయవాడ నగరంలో భారీగా కుళ్ళిన మటన్ అమ్మకాలు సాగిస్తున్నారు మటన్ షాపు యజమానులు. తనిఖీల్లో కేజీల కొద్దీ పురుగుపట్టిన మాంసం బయట పడడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. పబ్లిక్ ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుళ్ళిన మాంసాన్ని కొని మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల తీరుపై జనం మండిపడుతున్నారు. డబ్బుల కోసం పాడైన పురుగుపట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నారు.
ఇంటి వద్ద గోనె సంచులలో ధర్మకోల్ బాక్స్ లలో సుమారు 100 కేజీల గొర్రె మరియు మేక మాంసము నిల్వను పట్టుకున్నారు అధికారులు. రాణి గారి తోట, భూపేష్ గుప్తా నగర్ వాటర్ ప్లాంట్ వద్ద విక్రయాలు చేస్తున్నవారిని శ్రీహరి మాణిక్యం రాము తండ్రి ఓబేశ్వరరావుగా అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాదిన పరచుకొని దానిపై బ్లీచింగ్ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చేశారు అధికారులు. ఈ మాంసపు పదార్దములు వినుకొండ సంతలో చనిపోయిన గొర్రెలుగా గుర్తించారు. అక్కడ చనిపోయిన గొర్రెలను ప్రేగులను తొలగించి శుభ్రంగా శుభ్రపరచి పొట్టలో ఐస్ వేసి విజయవాడకు తీసుకుని వచ్చి అమ్మేస్తున్నాడా వ్యాపారి.
పూర్తిగా కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన మాంసంగా నిర్దారించారు. సంతలో చనిపోయిన గొర్రెలను సుమారు రూ. 1500/- నుండి 2000/- చొప్పున కొనుగోలు చేస్తారు వ్యాపారులు. వాటిని నగరానికి తరలించి ఇక్కడ మార్కెట్లో కేజీ రూ.800/- చొప్పున అమ్మకాలు చేస్తూ ఎడాపెడా అమ్మేస్తున్నారు. కృష్ణలంక రాణిగారి తోటలోని 5 షాపుల వారికి ఇటువంటి మాంసము విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో చెప్పారు వ్యాపారులు. దీంతో అధికారులువ వారిపై కేసులు నమోదుచేశారు.
Heavy Rains in Telangana: కురుస్తున్న వర్షాలు.. మూడు రోజులు భారీ వానలు