NTV Telugu Site icon

Mudragada Padmanabham: పవన్, మీ భాష వల్ల నష్టం తప్ప లాభం లేదు.. లేఖలో ముద్రగడ

Mudragada To Pk

Mudragada To Pk

Mudragada Padmanabham Gives Strong Counter To Pawan Kalyan In Letter: ప్రస్తుతం కాకినాడలో పర్యటిస్తున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అందులో.. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి, కొందరు రాజకీయంగా ఎదుగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యాలకు ముద్రగడ ఘాటు రిప్లై ఇచ్చారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే తాను ఈ లేఖ రాస్తున్నానన్న ఆయన.. తాను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని, యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమమూ చేయలేదని చురకలంటించారు. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి, యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరెందుకు అందించలేదు? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానన్నారు.

Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…

వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్న ముద్రగడ.. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం వాటిల్లుతుంది తప్ప లాభం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో, గుండ్లు గీయించారో సెలివ్వాలని డిమాండ్ చేశారు. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుందని మాట్లాడడం తప్పని సూచించారు. కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పు అని హితవు పలికారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదని పవన్‌ని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి, ఆయన్ను ఓడించాలని.. మీ సత్తా చూపించడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండని అడగాలని.. కలిసి పోటీ చేస్తున్నప్పుడు సీఎంని చేయమని అడగడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్ చెప్పినప్పుడు.. తానిచ్చిన సమాధానమేంటో అడిగి తెలుసుకోవాలని చెప్పారు.

Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ నిర్ణయం

Show comments