Site icon NTV Telugu

MT Krishna Babu: 2047 వరకు సికిల్ సెల్ అనీమియా లేకుండా చేయాలన్నదే లక్ష్యం

Sickle Cell Anemia Krishna

Sickle Cell Anemia Krishna

MT Krishna Babu On Sickle Cell Anemia: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ఈరోజు మొత్తం 7 కోట్ల మందికి సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏపీలోనూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో.. ఆరోగ్య కేంద్రాలలో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేపట్టనున్నారు. ఈ మిషన్‌ను లాంచ్ చేసిన అనంతరం.. మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని మంత్రి విడదల రజినీ వీక్షించారు. సిద్ధార్ధ మెడికల్ కాలేజీ లెక్చర్ హాల్‌లో ఈ వర్చురల్ స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు. మంత్రి రజనితో పాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ కృష్ణబాబు, కమీషనర్ జే.నివాస్ సైతం ఈ వర్చువల్ మీట్‌ని వీక్షించారు.

AP JAC Amaravati: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ స్పషల్ ఛీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. సికిల్ సెల్ అనీమియాను 2047 నాటికి లేకుండా చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. ఈ సంవత్సరం 6.5 లక్షల మందికి సికిల్ సెల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు. మ్యాచ్ అవ్వని ట్రైడ్స్ ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటే.. వారి పిల్లలకు సికిల్ సెల్ అనీమియా వస్తుందని తెలియజేశారు. దీనికి ప్రతీ ఒక్కరికీ ఒక కార్డు ఇస్తామని పేర్కొన్నారు. పాడేరులో మొదటి ఫేజ్‌లో 40 సంవత్సరాల వయసులోపు వారికి టెస్టులు చేస్తామన్నారు. మొదటగా స్కూలు, కాలేజీలకు వెళ్ళే వారికి టెస్టులు చేస్తామని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లాగా సికిల్ సెల్ అనీమియా కార్డు ప్రధానం చేస్తామన్నారు. తర్వాత తరాల వారికి సికిల్ సెల్ అనీమియా రాకుండా చూడటమే తమ లక్ష్యమని ఆయన విశదీకరించారు.

Humanity: మానవత్వం చూపిన పోలీసులు.. చిన్నారిని లాలించిన మహిళ కానిస్టేబుల్..!

Exit mobile version