Site icon NTV Telugu

Vijayasai Reddy: జగన్‌ ఆదేశాలే శిరోధార్యం.. ఇది కావాలనే ప్రస్తావన రాకూడదు..!

Vijayasai Reddy

Vijayasai Reddy

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంపీ విజయసాయి రెడ్డిని.. అనుబంధ సంఘాల ఇంచార్జ్‌కే పరిమితం చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యం… నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ప్రస్తావన ఎక్కడ రాకూడదన్నారు.. ఛార్టర్డ్ అకౌంటెంట్‌ అయిన నాకు జగన్ మోహన్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారన్న ఆయన.. సాక్షిలో ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ లాంటి పదవులను సంతృప్తికరంగా నిర్వహించాననన్నారు.. ఇక, అధినేత ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చడమే నా బాధ్యతని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి.

Read Also: Gudivada Amarnath: పీకే ప్రతిపాదన.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్‌నాథ్.

Exit mobile version