Kesineni Nani: నిన్నటి నిన్నే టీడీపీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని.. అదే దూకుడు చూపిస్తున్నారు.. ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.. ఎంపీ కేశినేని నాని సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రాజకీయ చైతన్యం ఎక్కువ అన్నారు.. నీతి, నిజాయితీ ఉన్న వాళ్లకే ప్రజలు ఓటేస్తారన్న ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే.. నాకే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తుచేసుకున్నారు.. పశ్చిమ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు.. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను వెస్ట్ నియోజకవర్గంలో చేపడుతున్నా.. పైకి వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఇక్కడి కార్యక్రమాలు అధిష్టానం దృష్టికి వెళ్లకపోవడానికి చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు.. అయతే, నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్న వాళ్లకి విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తే గెలవడం ఖాయంగా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో విడయవాడ వెస్ట్ సెగ్మెంట్‌లో టీడీపీ 25 వేల మెజార్టీతో గెలవబోతోంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నాని..
Read Also: Adapa Seshu: పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాహన ప్రమాదంలో కుట్ర..! ఆయనపై వైసీపీ అనుమానం..
కాగా, ఎన్నికల్లో పోటీపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని.. పార్టీలతో నాకు పని లేదు.. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంటుగా గెలిపిస్తారు.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అంటూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నేనెక్కడా చెప్పలేదన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని అంటూ వ్యాఖ్యలు చేశారు.. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు.. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీని పెరుగుతుందన్నారు. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవి.. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరాను.. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయని చెప్పుకొచ్చారు. టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు ఎంపీ కేశినేని నాని.. వంద చీరలు పంచి.. పది ట్రై సైకిళ్లు పంచి కొందరు దాన కర్ణుడులాగా కలర్ ఇస్తున్నారని.. ఈ దాన కర్ణుల చరిత్రేంటో..? ఎక్కడి నుంచి ఊడిపడ్డారో చరిత్ర చూడండి.. ఎన్నికలనగానే వస్తారు.. ఫౌండేషన్ అంటారు.. సేవా కార్యక్రమాలంటారు.. వీరికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పేదొళ్లకు డబ్బులిస్తారు.. జిందాబాద్ లు.. జైజైలు కొట్టించుకుంటారు.. ఇదేనా రాజకీయం అంటూ నిలదీశారు. ఓ చిన్న మాట కోసం నా వ్యాపారాలు వదిలేసుకున్నా అని గుర్తుచేసుకున్నారు.. అయితే, బెజవాడ ఎంపీ చేసిన కామెంట్లు మరోసారి టీడీపీలో కాకరేపుతున్నాయి.