ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్ధులను, పౌరులను త్వరగా స్వదేశానికి తరలించాలని రాజ్యసభలో టీడీపీ నేత కనకమేడల రవీందర్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానలో ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్దులను కలుసుకుని క్షేమసమాచారాలు తెలుసుకున్నారు ఎంపీ కనకమేడల.
ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఢిల్లీలో అన్నిరకాల సహాయాన్ని స్వయంగా దగ్గరుండి అందించాలని చంద్రబాబు ఆదేశించారు.అక్కడినుంచి వచ్చే విద్యార్థుల వెతలను, చేదు అనుభవాలను విదేశీ వ్యవహరాల మంత్రి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నాం అన్నారు కనకమేడల. విద్యార్ధులకు సహాయం అందించేందుకు 24 గంటలపాటు టీడీపీపీ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో వున్నారన్నారు. విద్యార్ధులు, తల్లితండ్రులు సహాయం కావాల్సిన వారు టీడీపీపీని సంప్రదించాలని కోరారు.
ఢిల్లీకి చేరుకున్న విద్సార్ధులు అందించే వివరాలు, ఉక్రెయిన్ సరిహ్దద్దుల్లో విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం అన్నారు. ఆందోళన చెందవద్దని విద్యార్థులను, తల్లితండ్రులను కోరుతున్నాం. మీకు అండగా ఉంటాం. ఉక్రెయిన్ లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను విద్యార్ధులు వివరించారు. ఉక్రెయిన్ రిహద్దుల్లో విద్యార్థుల పట్ల సాయుధ దళాలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మైనస్ డిగ్రీ చలిలో, సరైన ఆహారం, షెల్టర్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను తరలించే ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేయాలని ఎంపీ కనకమేడల రవీందర్ కుమార్ కోరారు.
