ఏపీలో కేబినెట్ కూర్పు తర్వాత అసంతృప్తి బయటపడుతూనే వుంది. కేబినెట్లో మార్సులు, కొత్త మంత్రులపై విపక్షాలు మండిపడుతూనే వున్నాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్ కూర్పులో అవమానించబడ్డ చాలా మంది ఓదార్పు కోరుకుంటున్నారన్నారు. బాధల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం రాజకీయాల్లో సహజం అన్నారు.
త్వరలో బీజేపీలోకి విస్త్రతమైన చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు ఎంపీ జీవీఎల్. బీజేపీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమైన ఎవరికైనా తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులను ప్రాంతీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. ప్రభుత్వానికి నెలరోజులు గడువు పెడుతున్నాం. బీసీ-డి సర్టిఫికెట్లు జారీ అవ్వకపోతే NCBCకి ఫిర్యాదు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Mekathoti Sucharitha: అది రాజీనామా కాదు.. థ్యాంక్స్ గివింగ్ నోట్
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేయడానికే పరిమితం అవుతోంది. రైల్వేజోనల్ కార్యాలయానికి 200 ఎకరాల భూమి అవసరం…దానిని వెంటనే కేటాయించాలని ఆయన కోరారు. ఈ.ఎస్.ఐ హాస్పిటల్ సహా పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని జీవీఎల్ ఆరోపించారు.
