NTV Telugu Site icon

MP Avinash Reddy: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌కి ఎంపీ అవినాష్ లేఖ.. ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు

Avinash Letter To Cbi

Avinash Letter To Cbi

MP Avinash Reddy Wrote Letter To CBI Director Praveen Sood About Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు. గతంలో వివేకా హత్య కేసుని విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో వివేకా హత్య కేసుని రామ్‌సింగ్ దర్యాప్తు చేశారని ఆ లేఖలో ఆరోపించారు. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్ ఆధారంగా లేఖ రాసిన అవినాష్‌రెడ్డి.. అందులో వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను ప్రస్తావించారు.

Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..

దస్తగిరి చెప్పిన నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్‌సింగ్ ఈ కేసు విచారణ జరిపారని అవినాష్‌రెడ్డి తెలిపారు. అసలు విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే.. నిబంధనలకు వ్యతిరేకంగా రామ్‌సింగ్ విచారణ జరిపారన్నారు. తనతో పాటు తన తండ్రి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను ఇరికించేందుకు సాక్ష్యుల్ని రామ్‌సింగ్ బెదిరించారని.. ఆయన వేధింపులు భరించలేకే పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ ఇద్దరూ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారని అన్నారు. పలువురు సాక్ష్యుల స్టేట్‌మెంట్లను సైతం రామ్‌సింగ్ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నా.. సీబీఐ అతడ్ని అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసిందన్నారు. వివేకా హత్య కేసులో తానిచ్చిన వాంగ్మూలాన్ని రామ్‌సింగ్ వక్రీకరించారని డాక్టర్‌ అభిషేక్‌రెడ్డి మీడియా ముందు చెప్పారని గుర్తు చేశారు.

Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?

వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కన పెట్టిందని అవినాష్ ఆ లేఖలో పేర్కొన్నారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాల్ని ఎత్తుకెళ్లడానికే ఈ హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదన్నారు. మున్నా లాకర్‌లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పుల్ని సవరించాలని చెప్పిన అవినాష్‌రెడ్డి.. అసలైన నేరస్తుల్ని పట్టుకొని, న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కోరారు.