SI Absconded : గంజాయి కేసులో స్మగ్లర్లు పట్టుపట్టడం సర్వసాధారణం.. కొన్నిసార్లు స్మగ్లర్లతో కుమ్మకయ్యే అధికారులు కూడా పట్టుబడుతుంటారు.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మోతిగూడెం ఎస్సై సత్తిబాబు కూడా గంజాయి కేసులో పట్టుబడ్డారు.. అయితే, ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారు కావడం సంచలనంగా మారింది.. దీంతో, రంపచోడవరం పోలీసుస్టేషన్ లో ఎస్సై పరారీపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Superstar Rajinikanth: బెజవాడకు సూపర్ స్టార్.. వేదిక పంచుకోనున్న చంద్రబాబు, రజనీ, బాలయ్య..
కాగా, మూడు రోజుల క్రితం చింతూరు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న కారు మోతిగూడెం పోలీసులకు పట్టుబడింది. ఎస్సై సత్తిబాబు.. నిందితులను గంజాయితో పట్టుకున్న కారు వదిలేశారు. ఇదే కారును నెల్లూరులో ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. అయితే, అక్కడ పోలీసులు కూపీ లాగితే.. మోతిగూడం ఎస్సై వ్యవహారం బయటపడింది.. దీంతో, నెల్లూరు పోలీసు అధికారులు స్థానికు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోతిగూడెం ఎస్సై సత్తిబాబును రంపచోడవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ ఎ. ఆర్. నుంచి రెండున్నర సంవత్సరాలు క్రిందట మోతిగూడెం ఎస్సై గా వచ్చిన సత్తిబాబు విచారణ నిమిత్తం ఏఎస్పీ కార్యాలయానికి తీసుకుని రాగా అక్కడి నుంచి పరారైయ్యాడు.