Tirupati: తిరుపతిలో పవన్ అనే యువకుడిని వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ అనిల్ రెడ్డితో పాటు మరికొందరు కలిసి దారుణంగా కొట్టారు. దీనిపై బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనిల్‌రెడ్డి, జగదీష్, దినేష్ అనే ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటన తర్వాత బాధితుడు పవన్ అజ్ఞాతంలోకి వెళ్లి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఆసక్తిగా మారింది.
Read Also: BC Reservation Bill: దగ్గర పడుతున్న గడువు.. బీసీ రిజర్వేషన్‌పై నెక్స్ట్ ఏంటి?
ఇక, తన బిడ్డ పవన్ కోసం అల్లాడుతున్న తల్లీ నీలం సునీత.. తన కొడుకు ఎక్కడ ఉన్నా.. త్వరగా ఇంటికి రావాలని ఓ వీడియోను విడుదల చేసింది. అరే పవన్ నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను.. నువ్వు ఎక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు.. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.. నిన్ను కొట్టి ఆ వీడియోలు అన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా నాకు పంపడం వల్లే కదా పోలీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశాం.. నీకు ఎలాంటి భయం అవసరం లేదు నాన్న అని వ్యాఖ్యానించింది.
అయ్యా, నీకు చేతులెత్తి మొక్కుతున్నాను.. నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న అంటూ పవన్ తల్లి నీలం సునీత బోరున ఏడ్చేసింది. నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే మాకు ఫోన్ చెయ్ నాన్న.. మేము అక్కడికి వచ్చి నిన్ను తీసుకు వస్తాం.. నాన్న, నేను.. అన్నం- నిద్ర మానేసి నీకోసం వెతుకుతున్నామని చెప్పుకొచ్చింది. దయచేసి మాకు ఫోన్ చేయరా.. నీవు ఎక్కడున్నా.. వచ్చి మేము నిన్ను తీసుకు వస్తామని పేర్కొనింది.
