Site icon NTV Telugu

భావ వ్యక్తీకరణకు మాతృభాష ఎంతో అవసరం: జేడీ లక్ష్మీనారాయణ

ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాతృభాష ప్రాముఖ్యతపై మాట్లాడారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలు చేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది అని సూచించారు. జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని అన్నారు. పరభాషలో బోధించడం వల్ల విద్యార్థులు అటు మాతృభాష, ఇటు పరభాష రెండింటినీ నేర్చుకోలేకపోతున్నారని లక్ష్మీనారాయణ అన్నారు.

Exit mobile version