Site icon NTV Telugu

Love Tragedy: బెజవాడలో విషాదం.. కూతురి ప్రేమకు తల్లి బలి

Mother Suicide Daughters Lo

Mother Suicide Daughters Lo

Mother Commits Suicide Because Of Daughters Love In Vijayadawada: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో ప్లాన్ చేసుకుని ఉంటారు. వయసు రీత్యా వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇక పెళ్లీడుకొచ్చాక.. ఒక మంచి అబ్బాయిని చూసి, పెళ్లి చేయాలని కలలు కంటారు. పిల్లలే తమ సర్వస్వమని బ్రతికే పేరెంట్స్‌కి.. తమ చేతుల మీదుగా పెళ్లి చేయాలని అనుకుంటారు. ఒక పండుగలా పెళ్లి తంతు నిర్వహించి, తమ బిడ్డని అత్తారింటికి పంపాలని కోరుకుంటారు. అలాంటిది.. ప్రేమ మోజులో పడి అమ్మాయిలు ఇళ్లు వదిలి వెళ్లిపోతే.. తల్లిదండ్రులు మనసు ఎంత క్షోభకు గురవుతుంది? వారి బాధని ఎవ్వరూ వర్ణించలేరు. కొందరైతే ఈ బాధని జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ తల్లి కూడా కూతురి ప్రేమ కారణంగా తనువు చాలించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Peppermint Oil: ఈ నూనె వాసన చూస్తే చాలు తలనొప్పి మాయం..!

విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెలతో నివసిస్తోంది. ఇతరుల్లాగా తమ కూతురిని ఇంట్లోనే బంధీగా ఉంచకుండా, తన కాళ్ల మీద తాను నిలబడాలని.. ఎంబీఏ వరకు కూతురిని చదివించారు. దీంతో ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థాయిలో ఉంది. ఇంకేముంది.. ఒక మంచి అబ్బాయిని చూసి, తమ కూతురికి పెళ్లి చేయాలని పేరెంట్స్ భావించారు. కానీ.. ఇంతలోనే కూతురు కుండబద్దలయ్యే విషయం చెప్పింది. ఆరు నెలల క్రితం తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా తమ కూతురు మాట వినలేదు. అతడ్నే చేసుకుంటానని మొండికేసింది. నిన్న మంగళవారం కూడా వివాదం తలెత్తడంతో.. తల్లి లలిత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ బాధలోనే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Pawan Kalyan: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

Exit mobile version