Love Tragedy: బెజవాడలో విషాదం.. కూతురి ప్రేమకు తల్లి బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Commits Suicide Because Of Daughters Love In Vijayadawada: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో ప్లాన్ చేసుకుని ఉంటారు. వయసు రీత్యా వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇక పెళ్లీడుకొచ్చాక.. ఒక మంచి అబ్బాయిని చూసి, పెళ్లి చేయాలని కలలు కంటారు. పిల్లలే తమ సర్వస్వమని బ్రతికే పేరెంట్స్‌కి.. తమ చేతుల మీదుగా పెళ్లి చేయాలని అనుకుంటారు. ఒక పండుగలా పెళ్లి తంతు నిర్వహించి, తమ బిడ్డని అత్తారింటికి పంపాలని కోరుకుంటారు. అలాంటిది.. ప్రేమ మోజులో పడి అమ్మాయిలు ఇళ్లు వదిలి వెళ్లిపోతే.. తల్లిదండ్రులు మనసు ఎంత క్షోభకు గురవుతుంది? వారి బాధని ఎవ్వరూ వర్ణించలేరు. కొందరైతే ఈ బాధని జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ తల్లి కూడా కూతురి ప్రేమ కారణంగా తనువు చాలించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Peppermint Oil: ఈ నూనె వాసన చూస్తే చాలు తలనొప్పి మాయం..!
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెలతో నివసిస్తోంది. ఇతరుల్లాగా తమ కూతురిని ఇంట్లోనే బంధీగా ఉంచకుండా, తన కాళ్ల మీద తాను నిలబడాలని.. ఎంబీఏ వరకు కూతురిని చదివించారు. దీంతో ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థాయిలో ఉంది. ఇంకేముంది.. ఒక మంచి అబ్బాయిని చూసి, తమ కూతురికి పెళ్లి చేయాలని పేరెంట్స్ భావించారు. కానీ.. ఇంతలోనే కూతురు కుండబద్దలయ్యే విషయం చెప్పింది. ఆరు నెలల క్రితం తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా తమ కూతురు మాట వినలేదు. అతడ్నే చేసుకుంటానని మొండికేసింది. నిన్న మంగళవారం కూడా వివాదం తలెత్తడంతో.. తల్లి లలిత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ బాధలోనే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తాజావార్తలు
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!