Fire Accident: కోనసీమలో అగ్నిప్రమాదం.. తల్లీ, కూతురు సజీవ దహనం

Fire Accident

Fire Accident

కోనసీమ జిల్లాలో అగ్నిప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో ఆకుల వారి వీధిలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది… ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు సజీవదహనం అయ్యారు.. తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న తల్లీ కుమారైలు.. సాధనాల మంగాదేవి (40), మేడిశెట్టి జ్యోతి (23) సజీవ దహనం అయ్యారు.. అయితే, ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. తెల్లవారుజామున పూరి గుడిసెకు ఎలా మంటలు అంటుకున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. దీంతో, మృతురాలి అల్లుడు మేడిశెట్టి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు అల్లవరం పోలీసులు.. ప్రమాదంపై కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.

Read Also: Astrology: జులై 2, శనివారం దినఫలాలు