NTV Telugu Site icon

Vijayawada Crime: డబ్బు తిరిగి ఇవ్వమన్న కారు వాష్ యజమానిపై దాడి

Vja Attack

Vja Attack

విజయవాడలో దారుణం జరిగింది. తమకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు రాజధాని కార్ వాష్ యాజమాని నాగరాజుపై దాడికి ప్రయత్నం చేశారు గుర్తుతెలియని దుండగులు. గ్యాంగ్ తో నాగరాజు షాపు వద్ద హల్ చల్ చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దాడి చేసేందుకు యత్నించిన హడావుడి దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. నాగరాజును చంపేస్తామంటూ బెదిరించారు దుండగులు. ఇవ్వాల్సిన డబ్బును అతి త్వరలో ఇచ్చేస్తానంటూ ఒప్పందం చేసుకున్న కార్ వాష్ లో పని చేసిన అప్పారావు అలియాస్ తంబి.

గతంలో చెప్పిన విధంగా అదే డబ్బును ఇవ్వాలని కోరడంతో కులాన్ని అడ్డుపెట్టుకుని గ్యాంగ్ తో నాగరాజును భయ భ్రాంతులకు గురి చేస్తున్న కార్ వాష్ లో పని చేసిన తంబి అలియాస్ అప్పారావు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్ వాష్ వద్ద నుండి వెళ్ళి పోయాడు రాజధాని ఎక్స్‌ప్రెస్ కార్ వాష్ ఓనర్ నాగరాజు. స్థానిక పోలీస్ స్టేషన్లో తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పినా విజయవాడ భవానీపురం పోలీసులు పట్టించుకోలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గ్యాంగ్ పట్ల చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్న భవానీపురం పోలీసులపై తీరుపై విజయవాడ వాసులు మండిపడుతున్నారు.

నాకు డబ్బులు ఇవ్వకపోగా దాడికి యత్నిస్తురని చెప్పినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాదితుడు నాగరాజు. నాపై దాడి చేసి నన్ను చంపితే దానికి భవానీపురం పోలీసులు బాధ్యత వహించాలంటున్నాడు బాధితుడు నాగరాజు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన విజయవాడలో వివాదాస్పదంగా మారింది. దీనిపై పోలీసు బాస్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.

PM Modi : మోడీ హైదరాబాద్‌ టూర్‌ మినిట్‌ టూ మినిట్‌ షెడ్యూల్‌ ..